జిల్లాలో ఇదీ పరిస్థితి..


Sat,November 30, 2019 02:33 AM

జిల్లాలో నిజామాబాద్ నగర పాలక సంస్థ, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగా భీమ్‌గల్‌ను మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా.. వాటిని ప్రభుత్వం 60 డివిజన్లుగా ప్రకటించింది. బోధన్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో 35 వార్డులు ఉండగా.. వాటిని 3 వార్డులుగా విభజించింది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో 23 వార్డులు ఉండగా.. వాటిని 36 వార్డులకు పెంచింది.

కొత్త మున్సిపాలిటీగా ఏర్పడ్డ భీమ్‌గల్‌ను 12 వార్డులుగా విభజించింది. వీటిని మళ్లీ పూర్తి పరిశీలన చేసి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. అన్ని పూర్తయిన వెంటనే పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ రానున్నది.
దీంతో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొననున్నది. నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలో గతంలో 50 డివిజన్లు ఉండగా.. శివారు గ్రామాలైన సారంగపూర్, కాలూర్, ఖానాపూర్, ముబారక్‌నగర్, గూపన్‌పల్లి, పాంగ్రా, బోర్గాం (పి), మానిక్‌బండార్ గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. తద్వారా మరో 10 వార్డులు పెరిగాయి. మొత్తం 60 వార్డులు ఏర్పాటు చేయగా.. 3 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. బోధన్‌లో 61,972 ఓటర్లు, ఆర్మూర్‌లో 53,625 ఓటర్లు, భీమ్‌గల్‌లో 13వేల ఓటర్లు ఉన్నట్లు అధికారులు గతంలో ప్రకటించారు.

112
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...