టార్గెట్ బాల్ పోటీలు షురూ


Mon,November 11, 2019 01:00 AM

-ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో 65వ రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం
-ఉమ్మడి పది జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు హాజరు
-పోటీలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే జోగు రామన్న

ఎదులాపురం :65వ రాష్ట్రస్థాయి అండర్-17, 19 బాలబాలికల టార్గెట్ బాల్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని న్యూహౌసింగ్ బోర్డులో ఉన్న మహాత్మాజ్యోతి బాఫూలే బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో (ఎస్‌జీఎఫ్) జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన అతిథులకు బ్యాండ్ చప్పుళ్ల మధ్య ఘనస్వాగతం పలికారు. అనంతరం క్రీడాకారుల నుంచి అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

ప్రభుత్వం క్రీడాకారులకు అండగా ఉంటుంది..
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. క్రీడాకారులు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఇది వరకే రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయని గుర్తు చేశారు. జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాక్రీడాకారులు అనేక పతకాలు సాధించి జిల్లా పేరును నిలబెట్టారన్నారు. మారుమూల జిల్లా అయిన ఆదిలాబాద్‌లో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషకరం అన్నారు. క్రీడాకారులు గెలుపోటములు సమానంగా స్వీకరించాలన్నారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో తెలంగాణ తరఫున ఆడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న, మావల ఎంపీపీ చందాల ఈశ్వరి, మావల జడ్పీటీసీ నల్ల వనిత రాజేశ్వర్, మావల సర్పంచ్ దొగ్గిలి ప్రమీల, ఏఎంసీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జైనథ్ ఎంపీపీ గోవర్ధన్, పేట సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పార్థసారథి, పి.కృష్ణ, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ గుండి మహేశ్, బీసీ గురుకులాల ఆర్సీవో గోపిచంద్ రాథోడ్, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రతిభ, టీటీ సంఘం అధ్యక్షుడు రాష్ట్రపాల్, పోటీల కన్వీనర్ స్వామి, పీఈటీలు, పీడీలు కృష్ణ, సత్యనారాయణగౌడ్, రేణుకా, జ్యోతి, సంగీత, సాయికుమార్, హరిచరణ్, రాకేశ్ పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...