రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా రన్నరప్‌గా ఇందూరు


Mon,November 11, 2019 12:58 AM

నిజామాబాద్ సిటీ: హైదరాబాద్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో రెండు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి ఆరో సబ్ జూనియర్ సెపక్‌తక్రా టోర్నమెంట్‌లో జిల్లా బాల బాలికలు రన్నరప్‌గా నిలిచారని జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బాగారెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం జరిగిన బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టుపై జిల్లా జట్లు 21-13, 21-14 స్కోర్లలో విజయం సాధించిందని పేర్కొన్నారు. బాలికల విభాగంలో జిల్లా జట్టు పై రంగారెడ్డి జట్టు 13-21, 17-21తో విజయం సాధించి రంగారెడ్డి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిందన్నారు. జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటిష్ దౌత్యవేత్త అండ్రూస్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సెపక్‌తక్రా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్సార్ ప్రేమ్‌రాజ్, ఉపాధ్యక్షుడు ఐలయ్య, వికేశ్, శ్రీకాంత్, డేవిడ్, క్రీడాకారులు పాల్గొన్నారు.

జాతీయ జట్టుకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు..
టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జిల్లా క్రీడాకారులు జాతీయ జట్టుకు ఎంపిక చేశారని తెలిపారు. అనీశ్, రాహుల్, చరణ్, బాలిక విభాగంలో లక్కీరెడ్డి, సాయి ప్రణీత, రిశిత, కీర్తిక ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంగా జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేశ వేణు, గాదరి సంజీవ్‌రెడ్డి క్రీడాకారులను అభినందించారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...