ముగిసిన మాధవనగర్ రైల్వేట్రాక్ మరమ్మతులు


Sun,November 10, 2019 01:46 AM

నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్, డిచ్‌పల్లి రహదారిపై మార్గమధ్యలో మాధవనగర్ వద్ద రైల్వేట్రాక్ మరమ్మతు పనులు శనివారం సాయంత్రం ముగిశాయి. రైల్వేగేటు మూసి ఉంచి ఆ శాఖ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ నాగభూషణం చారి దగ్గరుండి రైల్వే ట్రాక్ మరమ్మతు పనులను చేయించారు. శుక్రవారం 8 గంటల నుంచి శనివారం వరకు 33 గంటల పాటు మరమ్మతు పనులు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటలకు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఇరువైపులా మూసి ఉంచిన రైల్వేగేటును తెరిపించారు. దీంతో వాహన రాకపోకలు ప్రారంభమయ్యాయి. మాధవనగర్ రైల్వేగేటు మూసి ఉంచి ట్రాక్ మరమ్మతులు చేయడంతో నిజామాబాద్ నుంచి డిచ్‌పల్లి వైపు రావడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్‌కు వెళ్లటానికి ఆటో చార్జీ రూ.15లు అయితే డ్రైవర్లు రూ.20 వసూలు చేశారని ప్రయాణికులు తెలిపారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు గుండా చుట్టూ తిరిగ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంతో డీజిల్ ఎక్కువగా వినియోగించబడుతుందని రూ.5లు ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుందని ఆటో డ్రైవర్లు చెప్పారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles