జోరు పెంచిన ఆర్టీసీ


Sat,November 9, 2019 05:06 AM

-ఉభయ జిల్లాల్లో శుక్రవారం 495 బస్సులు నడిపిన అధికారులు
-క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకున్న 3లక్షల మంది ప్రయాణికులు
-కొనసాగిన కార్మికుల సమ్మె

నిజామాబాద్ సిటీ: నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు యథావిధిగా కొనసాగుతున్నాయి. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో అధికారులు బస్సులను విజయవంతంగా నడిపిస్తున్నారు. పల్లె వెలుగు నుంచి సూపర్ లగ్జరీ బస్సుల వరకు అన్ని రూట్లలో నడుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల కోసం సమయానికి బస్సులు నడుపుతున్నారు. బస్సు పాస్‌లను అనుమతిస్తున్నారు. ఉభయ జిల్లాల్లో శుక్రవార ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను కొనసాగించారు. శుక్రవారం అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలె కలెక్టరేట్ వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు. 5వ రోజు కొనసాగిన దీక్షకు మద్దతుగా ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికుల భారీ ర్యాలీ నిర్వహించారు.

దీక్షను భగ్నం చేసి నాయకులు, కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డిపో వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలో శుక్రవారం 495 బస్సులు నడిచాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 301 బస్సులు తిరిగాయి. ఆర్మూర్ డిపో నుంచి 72, బోధన్ డిపో నుంచి 84, నిజామాబాద్-1 డిపో నుంచి 76, డిపో-2 నుంచి 69 బస్సులు నడిచాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం శుక్రవారం 194 బస్సులు నడిచాయి. ఇందులో కామారెడ్డి డిపో పరిధిలో 84 బస్సులు, బాన్సువాడ డిపో పరిధిలో 110 బస్సులు నడిచినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సాల్మన్ తెలిపారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...