నిఘా నీడలో పచ్చని పల్లెలు


Sat,November 9, 2019 05:03 AM

నందిపేట్ రూరల్: ఇంటర్నెట్ విప్లవం కారణంగా ప్రపంచమే కుగ్రామంగా మారింది. నేడు సెల్ ఫోన్లలో వచ్చిన స్మార్ట్ యాక్సరీస్ కారణంగా ఎక్కడున్నా ప్రపంచంలో ఏం జరుగుతున్నా చేతిలోనే తెలుసుకునే వీలు కలిగింది. ఇప్పుడు అదే ఇంటర్నెట్‌తో గ్రామాల్లో చీమలు చిటుక్కుమన్నా తెలుసుకునే పరిజ్ఞానం పచ్చని పల్లెల సొం తం. ఇంటర్నెట్ గ్రామాలకు పరిచయం చేసిన నందిపేట్ మండలంలో ఇప్పుడు సీసీ కెమెరాల నిఘా నీడలోకి వస్తున్నాయి. పోలీస్ శాఖ ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలతో మమేకమవుతోంది. గ్రామాల్లో దొంగల భయం లేకుండా సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించకుండా సీసీ కెమెరాలు నిఘా పెడుతున్నాయి. గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఎక్కడైనా ఎవరిపైనా దాడి జరిగినా, దొంగతనం జరిగినా, అగంతకులు సంచరించినా వారి ప్రతి కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవుతున్నాయి. ఇప్పుడు పచ్చని పల్లెల్లో పోలీసులు రాక ముందే సీసీ కెమెరాల నిఘా 24 గంటల పాటు కొనసాగుతోంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు సుమారు రూ. లక్షకు పైగా ఖర్చవుతున్నా గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి వాటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...