ఏసీ బస్సుల పరుగులు


Fri,November 8, 2019 03:50 AM

-ఉభయ జిల్లాలో గురువారం నడిచిన476 బస్సులు
-క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకున్న 2.50 లక్షల మంది ప్రయాణికులు
-కొనసాగుతున్న కార్మికుల సమ్మె

నిజామాబాద్ సిటీ: నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, మినీ బస్సులు, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ ఏసీ బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు ఏసీ బస్సులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ డిపోల నుంచి ప్రతిరోజు గరుడ, గరుడ ప్లస్ బస్సులు నిజామాబాద్‌కు వస్తున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో పాటు మంగళవారం డ్యూటీలో చేరిన ఆర్టీసీ కార్మికులకు అధికారులు డ్యూటీలు వేశారు. మరోవైపు ఆర్టీసీ కార్మికలు సమ్మెను కొనసాగిస్తున్నారు. గురువారం అఖిలపక్ష నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిజామాబాద్ నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఉదయం 10.00 గంటల నుంచి ధర్నాచౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరి, కలెక్టరేట్ చౌరస్తా, తిలక్‌గార్డెన్, రైల్వేస్టేషన్ రోడ్డు, కాంగ్రెస్ భవన్ మీదుగా తిరిగి ధర్నాచౌక్‌కి చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు మధ్య ర్యాలీ కొనసాగింది. ఎలాంటి ఘటనలు జరగకుం డా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ ర్యాలీలో వామపక్షలు, టీడీపీ, కాంగ్రెస్, ప్ర జాసంఘాలు పాల్గొన్ని మద్దతు తెలిపాయి.

రీజియన్ పరిధిలో 476 బస్సులు
ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులతో పాటు హైర్ బస్సులు సమయానికి నడుస్తున్నాయి. అన్ని రూట్లలో బస్సులను అధికారులు నడిపిస్తున్నారు. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 476 బస్సులు నడిచాయి.

నిజామాబాద్ జిల్లాలో...
నిజామాబాద్ జిల్లాలో గురువారం మొత్తం 297 బస్సులు నడువగా, ఇందులో ఆర్మూర్ డిపో నుంచి 73 బస్సులు, బోధన్ డిపో నుంచి 81 బస్సులు, నిజామాబాద్-1 డిపో నుంచి 72, డిపో-2 నుంచి 71 బస్సులు నడిచాయి.

కామారెడ్డి జిల్లాలో...
కామారెడ్డి జిల్లాలో గురువారం మొత్తం 101 బస్సులు నడిచాయి. ఇందులో మొత్తం 179 బస్సులను నడిపించినట్లు ఆర్‌ఎం సాల్మన్ తెలిపారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...