ఎర్రజొన్న రైతులను ఆదుకున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే..


Thu,November 7, 2019 01:14 AM

వేల్పూర్ : ఎర్రజొన్న రైతులపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నద ని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై టీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం మండల కేంద్రంలో పార్టీ మండల కన్వీనర్ నాగధర్,ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొట్టాల చిన్నరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రైతుల పై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర, కరెంట్, సాగునీటి రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ఎర్రజొన్న రైతులకు రావాల్సిన బకాయిలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెల్లించింద న్నారు. ఎర్రజొన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తుందన్నారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ బోదపల్లి సురేశ్, పార్టీ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యుడు సామ మహిపాల్, కోమన్‌పల్లి సర్పంచ్ రాజేశ్వర్, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...