కొనుగోలు కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలి


Wed,November 6, 2019 01:32 AM

ఖలీల్‌వాడి : జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఎంపీ అర్వింద్‌ అధికారులకు సూచించారు. ప్రగతిభవన్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్‌ కమిటీ దిశా సమావేశం మంగళవారం ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. హౌసిం గ్‌, మైనింగ్‌, స్వచ్ఛ భారత్‌, ప్రధానమంత్రి సడక్‌ యోజ న, రూర్బన్‌, ఫసల్‌ బీమా, మిషన్‌ భగీరథ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లిన నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతుతో కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, స్టోరేజ్‌ చెల్లింపుల విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నా రు. సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రైతులకు ప్రయోజనం కలిగేలా కృషి చేయాలన్నారు. పంట నష్టానికి ఫసల్‌ బీమా పరిహారాన్ని అందించాలన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిపై జరిగిన దాడి అమానుషమని, బాధాకరమని ఈ సంఘటనను ఖండిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఒక నిమిషం మౌనం పాటించారు. సామాన్యుడికి ఇసుక సులభంగా దొరికే విధంగా చర్య తీసుకోవాలని, జిల్లాలో 15 ఇసుక రీచ్‌లు ఆపరేట్‌ అవుతున్నందున అందరికీ ఇసుక లభ్యమయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. అక్రమ మైనింగ్‌ నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

30 రోజుల ప్రణాళిక నిరంతర ప్రక్రియ జడ్పీచైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు
గ్రామ పంచాయతీ 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో రాజకీయాలకు అతీతంగా పాల్గొని ఆదర్శంగా నిలిచారని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. అధికారులు, ప్రజల సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేస్తారని, ఈ కార్యక్రమం ఆరంభం మాత్రమేనని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. సమష్టి కృషితో రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా ఎదిగితే ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందని అన్నారు. తాసీల్దార్‌పై జరిగిన ఘటన హేమమైనదని ఈచర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్‌ వాడకం నిషేధించేందుకు దిశా సమావేశంలో తీర్మానం చేయాలన్నారు.

అధిక వర్షపాతంతో పెరిగిన సాగు విస్తీర్ణం కలెక్టర్‌ రామ్మోహన్‌రావు
జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షం కురవడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని దీంతో పండించిన పంటకు మద్దతు ధర కల్పించేందుకు 310 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకార, వ్యవసాయం, సివిల్‌ సైప్లె, రెవెన్యూ శాఖల సమన్వయంతో ముందుకు పోతున్నట్లు చెప్పారు. అవసరమైన గన్నీ బ్యాగుల రవాణా కోసం వాహనాలు, స్టోరేజ్‌, మౌలిక సదుపాయాలు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇసుక కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు, ప్రభుత్వ పథకాల పనుల కోసం ఇసుక కొరత లేదన్నారు. రెండు పడకల గదుల కేటాయింపునకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపారు. డీఆర్డీవో రమేశ్‌ రాథోడ్‌, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...