విద్యావలంటీర్ నియామకంలో ఎంఈవో చేతివాటం


Mon,November 4, 2019 12:42 AM

నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలోని గౌతంనగర్ ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో విద్యా వలంటీర్ అక్రమ నియామకం బయటపడింది. డీఈవో అనుమతి లేకుండా నిజామాబాద్ ఎంఈవో విద్యా వలంటీర్‌ను నియమించి వేతనం చెల్లించి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు.

అసలు ఏం జరిగింది..
2018లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి విద్యా వాలంటర్లీను నియామక ప్రక్రియ చేపట్టింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతంనగర్ ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఒక పోస్టుకు ధనవేణి అనే విద్యా వలంటరీని ప్రభుత్వం నియమించింది. వారం రోజుల తర్వాత ధనవేణికి మరో ఉద్యోగం రావడంతో రాజీనామాచేసి వెళ్లిపోయింది. పోస్టు ఖాళీ కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆ పోస్టును భర్తీ చేయాలని నిజామాబాద్ మండల విద్యా శాఖ అధికారిని కోరాడు. జాఫర్ సిద్దిఖీని జిల్లా విద్యాశాఖాధికారి ప్రొసీడింగ్, అపాయింట్‌మెంట్ లేఖ లేకుండానే ఎంఈవో నియమించి వేతనం చెల్లించారు.
జిల్లా కేంద్రంలోని హైమాద్‌పూర్ కాలనీకి చెందిన జాఫర్ సిద్ధిఖీ 2018లో నిజామాబాద్ సౌత్ పరిధిలోని విద్యా వలంటీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ విడుదల చేసిన ఫలితాల్లో జాఫర్(53.1) మార్కులు, ఐజాజ్ అహ్మద్‌కు 48.54 మార్కులొచ్చాయి.

నిజామాబాద్ మండల విద్యాశాఖ అధికారి నిజామాబాద్ సౌత్‌లోని ఖలీల్‌వాడి ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న సాంఘిక శాస్త్రం పోస్టులో జాఫర్‌కు బదులు ఐజాజ్ అహ్మద్‌ను నియమించాడు. దీంతో తనకంటే తక్కువ మార్కులు ఉన్న ఐజాజ్ అహ్మద్‌కు జాబ్ ఎలా ఇచ్చారు అని జాఫర్ ఎంఈవోను ప్రశ్నించాడు. ఇదే సమయంలో గౌతంనగర్ ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం పోస్టు నుంచి ధనవేణి రాజీనామా చేసి వెళ్లడంతో ఎలాంటి ప్రొసీడింగ్ లేఖ లేకుండానే జాఫర్‌కు గౌతంనగర్ పాఠశాలలో విద్యా వలంటీగా ఎంఈవో నియమించారు. గౌతంనగర్ ఉర్దూ ప్రభుత్వ పాఠశాల నార్త్ పరిధిలో ఉంది. జాఫర్ సౌత్ పరిధిలో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. గౌతంనగర్ పాఠశాలలో నిజామాబాద్ నార్త్‌కు సంబంధించిన వారు మాత్రమే అర్హులు. ఈ విషయం తెలిసినా జాఫర్‌ను నియమించి వేతనం చెల్లించి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు.

ఎంఈవో ఆదేశాల మేరకే..
2018లో పాఠశాలలో సాంఘిక శాస్త్రం పోస్టు ఖాళీగా ఉన్న విషయం ఎంఈవో దృష్టికి తీసుకెళ్లానని ప్రధోనోపాధ్యాయుడు హఫీజ్ అహ్మద్ ఖాద్రీ తెలిపారు. జాఫర్‌ను వీవీగా తీసుకోమని ఎంఈవో చెప్పడంతో చేర్చుకున్నామన్నారు. అక్టోబర్‌లో టీఆర్టీ నియామకంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు రావడంతో వీవీ జాఫర్ తొలగించామన్నారు. ఎంఈవో ఆదేశాల మేరకు జాఫర్‌కు హాజరు సర్టిఫికెట్ ఇచ్చానని వివరించారు.


75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...