గంజాయి స్మగ్లర్‌పై నిజామాబాద్ పోలీసుల ఆరా


Mon,November 4, 2019 12:42 AM

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతానికి చెందిన షేక్‌సోహెల్ వృత్తి రీత్యా కారు డ్రైవర్‌గా పనిచేస్తూ అంతర్ రాష్ట్ర స్థాయిలో నేరస్తుడిగా పోలీసుల రికార్డులోకెక్కాడు. షేక్ సోహెల్ కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మరో ఇద్దరితో కలిసి ఇతర రాష్ర్టాలకు గంజాయి స్మగ్లింగ్ చేయడం ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సోహెల్, మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మహ్మద్ సద్దాం అనే మరో వ్యక్తితో కలిసి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ శనివారం వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పోలీసులకు చిక్కడంతో వారిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం నమస్తే తెలంగాణ దిన పత్రిక జిల్లా టాబ్లాయిడ్‌లో ఆదివారం వార్త ప్రచురితమైంది. దీంతో నిజామాబాద్ పోలీసులు ఈ వ్యవహారం పై ఆరాతీస్తున్నారు. నిజామాబాద్ ఏసీసీ శ్రీనివాస్‌కుమార్ సూచన మేరకు నగరంలోని నాగారం పరిధిలోని ఐదో టౌన్ పోలీస్‌లు వరంగల్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీస్‌లకు పట్టుబడిన షేక్ సోహెల్‌పై విచారణ ప్రారంభించారు. సదరు వ్యక్తి నాగారంలోని ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు, నిందితుడిపై గతంలో ఏవైనా కేసులు ఉన్నయా అనే కోణంలో ఐదో టౌన్ ఎస్సై జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. షేక్ సోహెల్‌పై జిల్లాలో గతంలో గంజాయి స్మగ్లింగ్, ఇతర కేసులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు సేకరించి, దాని నివేదికను పోలీసు ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...