విధుల్లో చేరే ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పిస్తాం


Mon,November 4, 2019 12:41 AM

నిజామాబాద్ క్రైం : సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈనెల 5న అర్ధరాత్రిలోపు భేషరతుగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో విధుల్లో చేరే ఆర్టీసీ కార్మికులకు పోలీస్ శాఖ తరపున పూర్తి భద్రత కల్పిస్తామని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్త్తికేయ ఆదివారం వెల్లడించారు. నిజామాబాద్ బస్ డిపో-1, డిపో-2, ఆర్మూర్ బస్ డిపో, బోధన్ డిపోలలోని ఆర్టీసీ కార్మికులు ఎవరైతే విధుల్లో చేరడానికి సిద్ధ్దంగా ఉన్నారో, వారికి పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుందని సీపీ పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికులు ఎవరైనా విధుల్లో చేరదలిస్తే వారికి పూర్తి రక్షణ కలిప్తామని, ఇంటి నుంచి విధులకు రావడానికి, డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటికి చేరవేసేందుకు పూర్తి భద్రత బాధ్యత తాము తీసుకుంటామని సీపీ భరోసా ఇచ్చారు. విధుల్లో చేరే కార్మికులను కౌన్సెలింగ్, రిక్వెస్ట్ పేరుతో ఎవరైనా అంటకపరిచినా,అడ్డగించినా, విధులు నిర్వర్తించకుండా ఎలాంటి ఇబ్బందులు కలిగించించినా, భౌతిక దాడులకు పాల్పడితే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ కార్త్తికేయ హెచ్చరించారు. విధుల్లో చేరదలచిన ఆర్టీసీ కార్మికులందరికీ పూర్తి రక్షణను పోలీస్ శాఖ కలిపిస్తుందని, ఎవరూ ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా వెంటనే సమాచారం అందించాలని సీపీ సూచించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...