బోధన్‌లో సమాధుల పండుగ


Mon,November 4, 2019 12:41 AM

శక్కర్‌నగర్: బోధన్ పట్టణ శివారులోని ఆచన్‌పల్లి ప్రాంతంలోని క్రిస్టియన్ సమాధుల తోటలో క్రిస్టియన్లు ఆదివారం రాత్రి సమాధుల పండుగ నిర్వహించారు. సమాధులపై కొవ్వొత్తులు వెలిగించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎస్‌ఐ ఫాదర్ కరుణాకర్ పలువురి ఆత్మలశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలో హార్వెస్టింగ్ సండే (కోతల పండుగ) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక వక్తగా రెవరెండ్ నిరంజన్ హాజరై దేవుడి వాక్కులను వినిపించారు. చర్చిని పండ్లు, కూరగాయలతో అలంకరించారు. కార్యక్రమంలో ప్రతినిధులు సక్కి శామ్యూల్, దమ్మల్ల జ్యోతిరాజ్, ఎడ్వర్డ్, భూషణ్, ఆనంద్, సాల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...