యూజీడీ.. రెడీ


Sun,November 3, 2019 02:16 AM

-ఇందూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పూర్తి
-ఎల్లమ్మగుట్టలో రెండో ఎస్టీపీ రేపు ప్రారంభం
-హాజరు కానున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి,అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా
-ఇక ఇంటింటికీ కనెక్షనే తరువాయి
- రూ. 246 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం
నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు పరిపూర్ణమయ్యాయి. ఇప్పటికే దుబ్బ ప్రాంతంలో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) పనులు పూర్తికాగా.. ఈ ఏడాది జూలైలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది విజయవంతంగా రన్ అవుతున్నది. రెండో ఎస్టీపీ నిర్మాణాన్ని నగరంలోని ఎల్లమ్మగుట్టలో చేపట్టగా ఈ పనులు సైతం పూర్తయ్యాయి. దీనిని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాతో కలిసి ఈ నెల 4న ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నగరానికి ఓ మణిహారమైన యూజీడీ పనులు పరిపూర్ణం కాగా.. మ్యాన్‌హోళ్లకు కనెక్షన్లు ఇవ్వడమే తరువాయి. ఈ పనులను నగర పాలక సంస్థ చేపట్టనున్నది. నగర సుందరీకరణకు కీలకమైన ఈ పనులను మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అంచనా వ్యయాన్ని మించిపోయినా.. అవసరమైన మరిన్ని నిధులు తెప్పించి ఎట్టకేలకు ఈ పనులన్నింటినీ పూర్తి చేయించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం ఎల్లమ్మగుట్ట ఎస్టీపీని ప్రారంభించనున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...