సీఎం, మంత్రులను కలిసిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి


Sun,November 3, 2019 02:15 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఆర్మూర్ ఎమ్మెల్యే, అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి శనివారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి పుచ్పగుచ్చం అందజేశారు. అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత సీఎంను కలిసి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్బంగా సీఎం ఎమ్మెల్యేను అభినందించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సీఎం ఈ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్...
అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి శనివారం పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా మంత్రి కేటీఆర్‌ను శనివారం జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లో కలిసి మొక్కను అందజేశారు. మంత్రి ఈ సందర్భంగా జీవన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

రోడ్ల కోసం నిధులు మంజూరు చేయాలని వినతి...
ఆర్మూర్ నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ను కోరారు. హైదరాబాద్‌లో ఆయనను కలిసి రోడ్ల పరిస్థితులను వివరించారు. గ్రామాల్లో కొత్త రోడ్లతో పాటు పాత రోడ్లకు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించడంతో కృతజ్ఞతలు తెలిపారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...