బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ


Sun,November 3, 2019 02:15 AM

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు, బాల్కొండ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి టీడీపీని వీడారు. టీడీపీని తెలంగాణలో ప్రజలు విశ్వసించడం లేదని పేర్కొంటూ, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వారు శనివారం ఉదయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ పంపారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, నాయకుడు బస్వా లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బాల్కొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనంతరం వారు టీఆర్‌ఎస్‌లో చేరాలని యోచిస్తున్నట్లు కొంతకాలం, తరువాత కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో క్యాడర్ క్రమంగా దూరం కావడంతో వారు టీడీపీనీ వీడక తప్పదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...