రెండు రోజుల్లో విధుల్లో చేరనున్న సీపీ


Sun,November 3, 2019 02:15 AM

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్త్తికేయ హైదరాబాద్‌తో పాటు విదేశాలో ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకొని శనివారం సాయంత్రం తిరిగి వచ్చారు. సెప్ట్టెంబర్ 29న ఆయన నెల రోజుల పాటు ప్రత్యేక సెలవుపై వెళ్ల్లారు. 15 రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణలో పాల్గ్గొన్నారు. అనంతరం 15 రోజుల క్రితం సీపీ కార్త్తికేయ లండల్‌కు శిక్షణకు వెళ్ల్లారు. అక్కడ పోలీసింగ్‌తో పాటు వారి పనితీరు, కేసుల నమోదు, దర్యాప్తు తో పాటు కేసుల ఛేదింపు తదితర అంశాలపై సీపీ లండన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆయన శనివారం సాయంత్రం లండన్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. సోమవారం సీపీ కార్త్తికేయ తిరిగి విధులో చేరనున్నట్లుగా సిబ్బంది ద్వారా తెలిసింది.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...