భీమ్‌గల్‌లో కుక్కలు, పందుల బెడద


Sun,November 3, 2019 02:14 AM

భీమ్‌గల్: పట్టణంలోని వివిధ కాలనీల్లో పందు లు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కాలనీలోకి వెళ్లే పాదచారులు, చిన్నారులు కుక్కలు, పందుల గుంపులను చూసి జంకుతున్నారు. రాత్రి వేళ కాలనీల్లో నడవాలంటే నే ప్రజలు జడుసుకుంటున్నారు. రోజు రోజుకు కుక్కలు, పం దుల సంతతి పెరుగుతున్నా వాటి నియంత్రణకు బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పట్టణంలో కొంత కాలంగా కుక్కలు, పందులు విపరీతంగా పెరిగాయి. వీటిని నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోక పోవడంతో పట్టణంలో ఎక్కడ చూసినా పందులు, కుక్కలు గుంపులుగా కనిపిస్తున్నాయి. గతంలో పందులు, కుక్కల నియంత్రణకు అప్పటి గ్రామపంచాయతీ పాలకవర్గం చర్యలు తీసుకుంది. దీంతో కొద్ది కాలం పాటు పట్టణ ప్రజలు వీటిబారి నుంచి రక్షించబడ్డారు. ప్రస్తుతం అధికారులు దృష్టిసారించక పోవడంతో పరిస్థితి ఎప్పటిలా మారింది. కుక్కలు, పందులు జనావాసాల్లో తిరుగుతున్నాయి. చిన్నపిల్లలపై దాడులు చేస్తున్నాయి.

కుక్కలైతే రాత్రి, ఉదయం అనే తేడా లేకుండా గుంపులుగా తిరుగుతూ బయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా పట్టణంలో కసూర్బా పాఠశాల గ్రామశివారులో ఉంటుంది. ఈ పాఠశాలకు వెళ్లాలంటే కుప్కల్ రోడ్డులో వెళ్లాలి. ఈ రోడ్డు వెంట ఇటీవల బల్దియా అధికారులు చెత్త డంప్ చేస్తున్నారు. అక్కడికి గుంపులుగా చేరుకుంటున్న కుక్కలు ఆదారి వెంట వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడులు చేస్తున్నాయి. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిత్యం వెళ్తున్నారు.

పందుల తరలింపు ఉట్టి మాటేనా
పట్టణం నుంచి దూరంగా పందులను తరలించాలని బల్దియా అధికారులు గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారి చేసి నెలలు గడుస్తున్నా పందుల నిర్వాహకులు అధికారుల ఆదేశాలను పట్టించుకోవడం లేదు. పందుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించిన అధికారులు వారికి నోటీసులు కూడా అందించారు. బల్దియా అధికారుల ఆదేశాలను పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించినా అవి అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా పందులు, కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...