స్వచ్ఛ బాన్సువాడలో భాగస్వాములు కావాలి


Sun,November 3, 2019 02:14 AM

బాన్సువాడ , నమస్తే తెలంగాణ: పట్టణం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, స్వచ్ఛ బాన్సువాడ కోసం పారిశుద్ధ్య పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సూచించారు. బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని ఎన్‌జీవోస్ కాలనీలో 30 రోజుల పారిశుద్ధ్య ప్రణాళిక కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణతో కలి సి శనివారం ప్రారంభించారు. అనంతరం పట్టణంలో ని ర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డ్రైనేజీలో నీరు నిలిచిపోయి, దుర్గంధం వెదజల్లడంతో మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, ఇన్‌చార్జి ప్రత్యేకాధికారి ఆర్డీవో రాజేశ్వర్‌తో మాట్లాడి శాశ్వత పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఎన్‌జీవోస్ కాలనీలో ఖాళీగా ఉన్న ప్లాట్ల స్థలం లో నీటి నిల్వపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 12,752 గ్రామ పంచాయతీల్లో 30 రోజుల పారిశుద్ధ్య ప్రణాళిక అమలుతో ఇప్పటికే స్వచ్ఛ గ్రామాలుగా మారాయని, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్గిందని అన్నారు. బాన్సువాడ మున్సిపాలిటిలో 30 రోజుల ప్రణాళికతో స్వచ్ఛ బాన్సువాడగా మారాలని ఆకాంక్షించారు. పట్టణంలోని 19 వార్డుల్లో పారిశుద్ధ్య ప్రణాళికకు ఒక్కో ఇన్‌చార్జీని నియమించి పనులు పూర్తి చేయాలని, ఇన్‌చార్జీగా నియామకమైన అధికారి పూర్తి స్థాయిలో వార్డు శుభ్రంగా మారేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గతంలో తడి, పొడి చెత్త సేకరణ కోసం ప్రజలకు చెత్త బుట్టలను పంపిణీ చేశామని తెలిపారు. ఇక ముందు కాలనీల్లో ఎవరి ఇంటిఎదుట చెత్త ఉంటే వారే బాధ్యులని, వారికి నోటీసులు జారీ చేసి, చార్జీలు వసూలు చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. పరిశుభ్రతకు పట్టణ ప్రజలు భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...