పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డికి ఘన స్వాగతం


Sat,November 2, 2019 03:01 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర అసెంబ్లీ పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ(పీయూసీ) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి తొలిసారి ఆర్మూర్‌కు వచ్చిన ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్వచ్చంద సం స్థల ప్రతినిధులు, మహిళా సం ఘాల సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. ఆర్మూర్‌లోని మామిడిపల్లి శివారులోని మానస హైస్కూల్ వద్ద శుక్రవారం అత్మీయ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. జీవన్‌రెడ్డి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లి నివాసంలో తల్లితండ్రులు వెంకటరాజన్న-రాజుబాయిల ఆశీర్వాదం తీసుకున్నారు. నవనాథ సిద్ధుల గుట్టపైన రామాలయం, అయ్యప్ప మందిరం, శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప మందిర ఆవరణలో దాతలు అయ్యప్ప శ్రీనివాస్ (రూ.1.50 లక్షలు), ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో రాఘవేందర్ (రూ.50వేలు) ఆర్థిక సాయంలో నిర్మించిన అన్నదాన షెడ్డును ప్రారంభించారు. పట్టణంలో చేపడుతున్న డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను పరిశీలించి మొక్కలు నాటారు.

ఆశన్నగారి జీవన్‌రెడ్డిని ప్రజాప్రతినిధులు, నాయకులు, మైనార్టీ కుల పెద్దలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఆలూర్ మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, 1104 విద్యుత్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమాల్లో ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, టీఆర్‌ఎస్ నాయకుడు ఖాందేశ్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, మల్యాల రాజబాబు, మధుకర్, నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, సుమీర్ హైమద్, నచ్చు చిన్నారెడ్డి, ఇట్టెడి గంగారెడ్డి, సొన్న చిన్న నర్సింలు, డెర గంగామోహన్, నచ్చు ఆశోక్, సుధాకర్, ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి, మోతె చిన్నారెడ్డి పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...