ఎస్సారెస్పీలోకి 23,530 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


Sat,November 2, 2019 03:01 AM

మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 23,530 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ఏఈఈ మహేందర్ శుక్రవారం తెలిపారు. 4 వరద గేట్లతో 12,500 క్యూసె క్కులను, ఎస్కేప్ గేట్ల నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, శుక్రవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటిమట్టం కలిగి ఉంద న్నారు. కాకతీయ కాలువకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ తెలిపారు.

జెన్‌కోలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి...
ఎస్సారెస్పీ జెన్‌కో కేంద్రంలో నాలుగు టర్బయిన్ల తో విద్యుదుత్పత్తి కొనసాగుతోందని డీఈ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు టర్బయిన్లతో 36.60 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంద న్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 10.3750 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగందని తెలిపారు.

అలీసాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
ఎడపల్లి: మండలంలోని అలీసాగర్ రిజర్వా యర్ గేట్ల ద్వారా నీటి విడుదల శుక్రవారం కొ నసాగింది. రిజ ర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో కొ న సా గుతుండడంతో రెం డు గేట్ల ద్వారా నీటిని వదు లుతున్నారు. గురువారం 150 క్యూసెక్కుల నీటి ని కిందకు వదిలిన అధి కారులు శుక్రవారం 100 క్యూసెక్కుల నీటిని వదిలా రు. రిజర్వాయ ర్ పూర్తి కెపాసిటీ 304 ఎంటిఎఫ్ కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో 280 ఎంటిఎఫ్ నీటి సామర్ధ్యం ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో 200 క్యూసె క్కుల వరద వస్తోంది. దీంతో అధికారులు రెండు గేట్ల ద్వారా 100 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదులుతూ కాలువల ద్వారా మరో 100 క్యూసెక్కులు నీటిని బెలాల్ చెరువులోకి వదులు తున్నారు. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో ఇదేవిధంగా కొనసాగితే శనివారం కూడా నీటిని వదులు తామని ఇరిగేషన్ ఏఈ అజాంషరీఫ్ తెలిపారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...