బాసరలో మూలా నక్షత్ర పూజా సందడి


Sat,November 2, 2019 03:00 AM

బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం మూలానక్షత్ర పూజను అర్చకులు ఘనంగా నిర్వహించారు. పంచమి శుభముహూర్తం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూ జలు చేశారు. మంచిరోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారి చెం త అక్షరాభ్యాసం చేయించారు. అటు కార్తీక మాసం మొదటి శుక్రవారం కావడంతో గోదావరి నది వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు నందకిశోర్, శివ, శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.

అమ్మవారికి వెండి గొడుగు బహూకరణ
జ్ఞాన సరస్వతీ అమ్మవారికి శుక్రవారం పోతుగంటి దిగంబర్ రావు దంపతులు వెండి గొడుగును బహూకరించారు. అమ్మవారికి మొక్కు చెల్లింపులో భాగంగా ప్రత్యేకంగా వెండి గొడుగు (చక్రం) తయారు చేయించారు. ఆలయ గర్భగుడిలో ఆలయ అర్చకులతో ప్రత్యేక పూజలు జరిపి బహూకరించారు.

భారీగా అక్షరాభ్యాసాలు
అమ్మవారి ఆలయంలో శుక్రవారం మూలనక్షత్రం సందర్భంగా భారీ అక్షరాభ్యాసాలు జరిగాయి. శుభ ముహూర్తం ఉండడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రూ. వెయ్యి అక్షరాభ్యాసాలు 504, రూ. వంద అక్షరాభ్యాసాలు 430, ప్రత్యేక దర్శనం రూ. వందవి 800, మండప ప్రవేశం 290, రూ. 200 అభిషేకం 94, లడ్డు ప్రసాదాల ద్వారా అమ్మవారి ఆలయానికి ఒక్క రోజే రూ. 8,69,300 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...