బంద్ ప్రశాంతం


Sun,October 20, 2019 04:26 AM

నిజామాబాద్ సిటీ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పలు వామపక్షాల పార్టీలు ఇచ్చిన బంద్ శనివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ముందస్తుగా పోలీసులు పలువురు రాజకీయ నాయకులను అరెస్టు చేశారు. బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య బస్సులు ప్రశాంతంగా నడిచాయి. శనివారం ఉదయం నుంచి నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి బస్సులు బయటకు వచ్చాయి. యథావిధిగా అన్ని ప్రాంతాలకు బస్సులను అధికారులు నడిపించారు. అన్ని ప్రభుత్వం శాఖల్లో పరిపాలన కొనసాగింది. వ్యాపార సముదాయాలు ఉదయం నుంచి తెరుచుకున్నాయి.

కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా సాగింది
వామపక్ష పార్టీలు ఇచ్చిన బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. శనివారం ఉదయం బస్డాండ్ ఎదుట బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవాలని చేసిన ప్రయత్నాలను పోలీసులు విఫలం చేశారు. అడ్డుకున్న రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు, వామపక్షాల నాయకులను పోలీసులు ఆరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఉదయం తెరిచిన కొన్ని వ్యాపార సముదాయాలను ఆర్టీ సీ కార్మికులు, వామపక్షల నాయకులు మూసివేయించా రు. కాంగ్రెస్ నాయకులు తాహెర్‌బిన్ హందాన్, కేశవేణు, బీజేపీ నాయకులు యెండల లక్ష్మీనారయణ, కార్యకర్తలను బస్టాండ్ ఎదుట ఆరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజ న్ కార్యదర్శి ఆకుల పాపయ్యను, రెండో డిపో ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధా న కార్యదర్శి ఓమయ్యను అరెస్టు నిజామాబాద్ మూడో టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బస్టాండ్ వద్ద బ స్సులు నడపకుండా ధర్నాకు వెళ్లిన జేఏసీ చైర్మన్ భాస్క ర్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు ప్రభాకర్‌ను శనివారం ఉదయం 6గంటలకు పోలీసులు అరెస్టు చేసి మోపాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వామపక్షాల ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట రోడ్డు పైన రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు అరెస్టు చేసి మాక్లూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్, నారాయణ దాస్, ఆశనారాయణ, సీహెచ్ సాయిలు, గోవర్ధన్‌ను పోలీస్ అరెస్టు చేసి నిజామాబాద్ ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టీడీపీ నాయకులను బస్టాండ్ ఎదుట అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు.

యథావిధిగా కొనసాగిన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు...
వామపక్షాలు ఇచ్చిన బంద్ కొనసాగినా.. ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరై పనిచేశారు.
వ్యాపార,వాణిజ్య సముదాయాలు ఉదయం తెరుచుకున్నాయి. పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్వాహకులు తమ వ్యాపారాలను కొనసాగించారు. రైళ్లు యథావిధిగా నడిచాయి. బంద్ సందర్భంగా ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేశారు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఆటోలను, క్యాబ్‌లను ఆశ్రయించడంలో అధికంగా డబ్బులు వసూలు చేశారు.

నడిచిన బస్సులు
ఒకవైపు బంద్ సందర్భంగా నిరసనలు కొనసాగగా.. మరోవైపు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు వచ్చాయి. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో శనివారం 49 బస్సులు నడిచాయి. కేవలం అధికారులు ఆర్టీసీ బస్సులను మాత్రమే నడిపించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపో పరిధిలో 9 బస్సులు, బోధన్ డిపో పరిధిలో 5, నిజామాబాద్-1 డిపో పరిధిలో 21, నిజామాబాద్-2 డిపో పరిధిలో 8.. మొత్తం 43 బస్సులు నడిచాయి. కామారెడ్డి జిల్లా కామారెడ్డి డిపో పరిధిలో 2, బాన్సువాడ డిపో పరిధిలో 4.. మొత్తం 6 బస్సులు నడిచాయి. శనివారం కేవలం ఆర్టీసీ బస్సులు మాత్రమే నడిపించామని, హైర్ బస్సులు మాత్రం బయటకు రాలేవని, బోధన్‌లో ఒకటి, దాస్‌నగర్ వద్ద ఒక ఆర్టీసీ బస్సుల అద్దాలను నిరసనకారులు ధ్వంసం చేశారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...