వీఆర్వోపై దాడి చేయడం సరికాదు


Sat,October 19, 2019 02:16 AM

ఇందల్వాయి : గ్రామ రెవెన్యూ అధికారులపై ఇష్టారాజ్యంగా దాడులు చేస్తే సహించేది లేదని ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన వీఆర్వో ఎం.గంగాధర్‌పై శుక్రవారం అదే గ్రామానికి చెందిన కన్నె సాయిలు, నీరడి శ్రీనివాస్ దాడి చేయడంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నల్లవెల్లి వీఆర్వో మాట్లాడుతూ నల్లవెల్లి ఆర్‌ఎస్‌ఆర్ (రిజర్వుడ్ సర్వర్ రేంజ్)లో ఇబ్బందులు ఉండడంతో కన్నె సాయిలుకు చెందిన 4 గుంటల భూమిని పట్టాదారు పాసు పుస్తకాల్లో నమోదు చేయలేకపోతున్నామని, ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పినా పట్టించుకోకుండా శుక్రవారం తనపై దాడికి పాల్పడినట్లు ఆర్డీవోకు వివరించారు. దాడి చేయడంతో పాటు సెల్‌ఫోన్‌ను లాక్కొని దుర్భాషలాడారన్నారు.

గ్రామస్తుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి చేసిన కన్నె సాయిలు, నీరడి శ్రీనివాస్‌లపై సర్పంచ్, ఎస్సైకి ఫిర్యాదు చేయనున్నామన్నారు. ఈ సందర్భంగా ధర్పల్లి మండల వీఆర్వోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, డిచ్‌పల్లి మండల వీఆర్వోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, ఇందల్వాయి మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆర్టీవో వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఇందల్వాయి వీఆర్వోల సంఘం అధ్యక్షుడు భూమయ్య, వైస్ ప్రెసిడెంట్ యుగంధర్, సెక్రెటరీ మధు, క్యాషియర్ గంగాధర్, వీఆర్వోలు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...