అగ్రిమెంట్ లేకుండా ఎర్రజొన్న విత్తనాలు విక్రయిస్తే చర్యలు


Fri,October 18, 2019 03:58 AM

కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ : బైబ్యాక్ ఒప్పందాలు లేకుం డా ఎర్ర జొన్న విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భీమ్‌గల్ ఏడీఏ మల్లయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైసెస్సులు కలిగిన వ్యాపారుల నుంచి బైబ్యాక్ ఒప్పందం చేసుకొని ఎర్రజొన్న విత్తనాలు తీసుకోవాలని రైతులను కోరారు. దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి ఎర్రజొన్న పంట సాగు చేయవద్దని సూచించారు. ఎర్రజొన్న పంటకు మద్దతు ధర లేనందున రైతులు మద్దతు ధర కలిగిన పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. యాసంగి పంటల కాలానికి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నందున మొక్క జొన్న, నువ్వులు, కుసుమలు, ఆవాలు, తదితర పంట లు వేసుకోవాలని కోరారు. నీటి వసతి ఉన్నవారు వరి పంట లు సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన విత్తనాలను లైసెన్సు కలిగిన అధీకృత డీలరు వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...