మత్స్యకారుల అభ్యున్నతికి కృషి


Thu,October 17, 2019 12:46 AM


నందిపేట్: మండల కేంద్రంలోని రఘునాథ చెరువులో ఎంపీపీ వాకిడి సంతోష్, సర్పంచ్ సంబారు వాణి చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, ఉపసర్పంచ్ రాంచందర్, వార్డు సభ్యులు ఎస్‌జీ తిరుపతి, కొండి గంగాధర్, కొత్తూర్ భరత్, సాయిలు, మత్స్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మాక్లూర్‌లో..
మాక్లూర్: మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని మండల వైస్ ఎంపీపీ సుక్కిసుజాత అన్నారు. బుధవారం గ్రామ శివారులోని చెరువులో ప్రభుత్వ సబ్సిడీపై అందించిన చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పీర్‌సింగ్‌నాయక్, రైతు సమన్వయ సమితి మండల సభ్యురాలు బాశెట్టి సుమలత, నాయకులు సుక్కిసుధాకర్, చిన్న రమేశ్, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. గుత్పలో చేప పిల్లలను మత్స్యకారులు స్థానిక చెరువులో విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ సంఘం అధ్యక్షుడు పల్లికొండ సాయిబాబా, జిల్లా డైరెక్టర్ బట్టు నరేందర్, మత్స్య సంఘం మండల అధ్యక్షుడు రవికుమార్, సభ్యులు తదితరులు పాల్గ్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...