కలప చోరీ కేసులో ఆరుగురి రిమాండ్


Tue,October 15, 2019 01:08 AM

కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ : మండల కేంద్రంలో ఈ నెల ఒకటో తేదీన బాల కిషన్‌కు చెందిన కార్పెంటర్ షాపు నుంచి టేకు దుంగల చోరీ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు కమ్మర్‌పల్లి ఎస్సై ఆసిఫ్ తెలిపారు. ఈ కేసులో భీమ్‌గల్ మండలం కారేపల్లికి చెందిన మాలవత్ కిషన్‌లాల్, గుగలోత్ చందర్, బదావత్ రవి, మేడావత్ రామల్, భూక్యా సురేశ్, మూవత్ నరేశ్‌ను అరెస్టు చేసి టేకు దుంగలను, టాటా ఏస్ వాహనం, బైకును స్వాధీనం చేసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ షకీల్, కానిస్టేబుల్ విఘ్నేష్, రంజిత్, భూమేశ్, సంతోష్, మంగీలాల్ పాల్గొన్నారు.

కలప పట్టివేత
ఇందల్వాయి : దొన్కల్ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉన్న టేకు కలపను స్వాధీనం చేసుకున్నట్లు సెక్షన్ అధికారి బాబు తెలిపారు. సోమవారం బీట్ అధికారులతో కలిసి దొన్కల్ కంపార్ట్‌మెంట్ 633 పరిధిలో రూ.20 వేల విలువైన టేకు దుంగలు పట్టుకున్నట్లు తెలిపారు. ఎలాంటి సమాచారం లేకుండా అటవీ ప్రాంతం నుంచి కలపను, ఇసుకను, అటవీ సంపదను కొల్లగొడితే కఠిన చర్యలతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీట్ అధికారి, అటవీ సిబ్బంది ఉన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...