ప్రణాళికతో పల్లెలకు కొత్త కళ


Wed,September 18, 2019 01:20 AM

కోటగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికతో పల్లెలకు కొత్త కళ సంతరించుకుంటున్నదని టీఆర్‌ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం 30 రోజుల పల్లె ప్రణాళిక హరితహారంలో భాగంగా కొల్లూర్, సుంకిని గ్రామాల్లో పోచారం సురేందర్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసిమొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను పచ్చని సీమలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 30 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా గ్రామస్తులందరూ భాగస్వాములై గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామంలో ఉన్న మురికి కాలువలో చెత్త వేయకుండా చెత్తకుండీలోనే వేయాలని, రోడ్డు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు చూచించారు. గ్రామాల్లో పాత ఇండ్లు, ముళ్ల పొదలను తొలగించడంతో పల్లెలకు కొత్త శోభ సంతరించుకుంటున్నదని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పోచారం సురేందర్‌రెడ్డికి శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌పటేల్, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, సర్పంచ్ మాధవ్‌రావు, కొల్లూర్ సర్పంచ్ కాలే నాగరాణీ, సంపత్, కొల్లూర్ హరి, లోని జగన్, సుంకిని ఉప సర్పంచ్ దిగంబర్‌పటేల్, వీరేశంపటేల్, రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, నీరడి గంగాధర్, ఎంపీటీసీలు సాయిలు, అనంత విఠల్, రాజేందర్, మండల ప్రత్యేకాధికారి శంకర్‌నాయక్, తహసీల్దార్ విఠల్, ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...