రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు 24 మంది విద్యార్థుల ఎంపిక


Wed,September 18, 2019 01:19 AM

ఖలీల్‌వాడి: ఉమ్మడి జిల్లా స్థాయి కరాటే అండర్ 14-17 బ్లాక్, గ్రీన్ బెల్ట్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ మంగళవారం డీఎస్‌ఏ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించినట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి మోహన్ తెలిపారు. రాష్ట్ర స్థాయికి అండర్ -17 నిర్మల్, అండర్ -14 జగిత్యాల్‌లో జరిగే ఆటల పోటీలకు 24 మంది క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపైర్లుగా పీఈటీ ఈశ్వర్, చంద్రశేఖర్‌లు వ్యవహరించారు. కార్యక్రమంలో పీడీ శ్రీధర్, పీఈటీలు వెంకటేశ్వర్‌రావు, మధుసూదన్, రమేశ్, తారాచంద్, ఎడ్ల వెంకటేశ్, సాయిలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు
విద్యానగర్ : కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల బాస్కెట్ బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి తారాచంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీ అండర్ 14 బాలబాలికలకు, 19వ తేదీన అండర్ 17 బాల బాలికలకు నిజామాబాద్‌లోని డీఎస్‌ఏ మైదానంలో సెలక్షన్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. బోనాఫైడ్ సరిఫికెట్‌తో ఉదయం 10 గంటల వరకు హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 7013289048 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...