క్రీడలతో మానసికోల్లాసం


Wed,September 18, 2019 01:19 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు, మానసికోల్లాసం కలుగుతుందని ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆర్మూర్ అర్బన్ స్థాయి మండల అంతర పాఠశాలల బాల బాలికల క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల్లో పాల్గొనడంతో ఆరోగ్యకరంగా ఉండవచ్చన్నారు. ఆర్డీవో క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం మార్చ్‌ఫాస్ట్‌లో ఎంపీపీ పస్క నర్సయ్య గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంఈవో పింజ రాజగంగారాం, క్రీడల కన్వీనర్, పాఠశాల హెచ్‌ఎం కవిత, పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...