కళాశాల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ


Wed,September 18, 2019 01:19 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం దాతల సహకారంతో విద్యార్థులకు యూనిఫాంను డీఐఈవో దాసరి ఒడ్డెన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులందరూ ఇకమీదట ఏకరూప దుస్తులతో కళాశాలకు రావాలన్నారు. విద్యార్థులకు దుస్తులను అందించిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గంగారాం, నర్సయ్య, స్వర్ణ, రవి, సుభాష్, చంద్రశేఖర్, గంగాధర్, చంద్రమోహన్, లక్ష్మణ్, పవన్, దేవదాస్, రమేశ్, సురేశ్, సంతోష్, జయలక్ష్మి, పాషా, లక్ష్మి, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...