రోగులకు భరోసా


Mon,September 16, 2019 03:50 AM

-బాన్సువాడ ఏరియా దవాఖానకు బ్లడ్ సెల్స్ సెపరేషన్ మిషన్ మంజూరు
-పేదలకు మరింత చేరువగా సర్కారు వైద్యం
-జ్వర పీడితులకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రభుత్వ నిర్ణయం
-ప్లేట్‌లెట్స్ లెక్కింపు ఇక సర్కారు దవాఖానలోనే..

బాన్సువాడ రూరల్ : నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించి ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ సర్కారు పనిచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో వైద్య సేవలు మెరుగు పరిచి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నది. వాతావరణ పరిస్థితులతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్న నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా సర్కారు వైద్యం అందించాలనే లక్ష్యంతో విషజ్వరాలపై రాష్ట్ర సర్కారు యుద్ధం ప్రకటించింది. జ్వరం బారిన పడి ప్లేట్‌లెట్స్ బారిగా పడిపోయి ప్రైవేటు దవాఖానలో పరీక్షలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు అండాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్రంలోని 12 ఏరియా దవాఖానలకు రూ. 4.24 కోట్లు వెచ్చించి బ్లడ్ సెల్స్ సెపరేషన్ మిషన్లు మంజూరు చేసింది. ఇందులో బాన్సువాడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు మిషన్ మంజూరు చేయడంతో ఇక నుంచి ప్లేట్‌లెట్స్ పరీక్షలు సర్కారు దవాఖానలో చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనేక మంది పేద ప్రజలకు మేలు చేకూర్చినైట్లెంది. ఇక నుంచి ప్లేట్‌లెట్స్ లెక్కింపు పరీక్షలు ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా అందనున్నాయి. రూ. 35లక్షల విలువ చేసే మిషన్ బాన్సువాడ ఏరియా దవాఖానకు మంజూరు కావడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందుబాటులోకి ప్లేట్‌లెట్స్ లెక్కింపు పరీక్షలు..
నిరుపేదలకు నాణ్యమైన సర్కారు వైద్యం అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్నారు. ఇందులో భాగంగా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు అవసరమగు మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, మందులు, వాహనాలు అందుబాటులో ఉంచుతున్నారు. మెరుగైన వైద్యం అందిస్తుండడంతో సర్కారు దవాఖానలకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ దవాఖానలోనే అన్ని రకాల వైద్య సేవలు అందుతుండడంతో ప్రైవేటు దవాఖానలకు వెళ్లే రోగుల సంఖ్య తగ్గి, సర్కారు దవాఖానలకు వచ్చే వారి సంఖ్య బారీగా పెరిగింది.

కేసీఆర్ కిట్టు, అమ్మ ఒడి పథకాల అమలుతో సర్కారు దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగి, ప్రైవేటు దవాఖానలు వెలవెల బోతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులు, దవాఖానల్లో ప్లేట్‌లెట్ల కొరత ఏర్పడింది. దీంతో సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి దవాఖానకు వచ్చే భాధితులకు శరవేగంగా అన్ని రకాల వైద్యసేవలు అందించడంపై దృష్టిసారించారు. తక్షణమే రాష్ట్రంలోని 12 దవాఖానలకు బ్లడ్ సెల్స్ సెపరేషన్ మిషన్లు మంజూరుకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మిషన్లు దవాఖానకు చేరుకున్నాయి. సిబ్బంది నియామకం కాగానే పేదలకు సర్కారు దవాఖానలోనే పరీక్షలు నిర్వహించనున్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...