ఎస్సారెస్పీ ఎత్తిపోతలకు కాళేశ్వర జలసిరి


Mon,September 16, 2019 03:47 AM

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ: ఎస్సారెస్పీపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాలు ఇకపై మూడు కాలాల పాటు ఆయకట్టుకు నీరందించనున్నాయి. కాళేశ్వరం జలాలతో మూడు కాలాలు నీరందించుకునే అవకాశం ఏర్పడింది. పునరుజ్జీవం పథకం ద్వారా కాళేశ్వరం జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తీరాన్ని చేరడంతో ఎత్తిపోతలకు పుష్కల జల సంపద అందనుంది. ఎస్సారెస్పీలో నీళ్లుంటే పండినట్లు.. లేకుంటే ఎండినట్లేనని ఏటా రైతులు పడుతున్న చింత దూరమైంది. పునరుజ్జీవ పథకం విజయవంతమై కాళేశ్వరం జలాలను ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రాజెక్టులోకి తరలించుకునేలా ప్రాజెక్టు చెంతనే కాళేశ్వరం జలాలు చేరాయి. ఇక మీదట ఎస్సారెస్సీ బ్యాక్ వాటర్ ఆధారంగా ఉన్న ఎత్తిపోతల పథకాల కింద, ఎస్సారెస్సీ దిగువన ఎత్తిపోతల పథకాల కింద జిల్లాలో ఉన్న 2,53,148 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి కొరత శాశ్వతంగా తీరిపోనుంది.

175
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...