లక్షల ఎకరాల్లో సాగుకు దోహదం..


Mon,September 16, 2019 03:47 AM

ఎస్సారెస్సీ ఎగువన బ్యాక్‌వాటర్ ఆధారంగా గుత్ప, అలీసాగర్ సహా 22 ఎత్తిపోతల పథకాలు, దిగువన లక్ష్మి, వేంపల్లి, నవాబు, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, బోదెపల్లి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఎగువన ఉన్న ఎత్తిపోతల పథకాల కింద 1,35,941 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో అధికంగా గుత్ప ఎత్తిపోతల పథకం కింద 38 వేల ఎకరాలు, అలీసాగర్ ఎత్తిపోతల పథకం కింద 53,793 ఎకరాల ఆయకట్టు ఉంది. దిగువన ఎత్తిపోతల పథకాల కింద 36 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో అధికంగా చౌట్‌పల్లి ఎత్తిపోతల కింద 9 వేల ఎకరాలు, నవాబు ఎత్తిపోతల కింద 8వేల ఎకరాలు ఉంది. వీటితో పాటు ఎగువన, దిగువన ఇరవై వరకు ఐడీసీ ఎత్తిపోతల పథకాల కింద 80వేల ఎకరాల ఆయకట్టు ఉంది.

చివరి ఆయకట్టుకూ అందనున్న నీరు...
ఈ ఎత్తిపోతల పథకాలకు మొత్తం కలిపి 19 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. దిగువన ఎత్తిపోతల పథకాల కింద 4 టీఎంసీలు, ఎగువన ఎత్తిపోతల పథకాల కింద 7 టీఎంసీలు, ఐడీసీ ఎత్తిపోతల కింద 7.7 టీఎంసీల నీరు అవసరం ఉంటుం ది. నీటి ఆవశ్యకత పరిస్థితి ఇలా ఉంటే.. ఏటా సరిపడా నీరందక ఎత్తిపోతల పథకాల కింద సాగునీటి ఇబ్బందులు ఎదురవ్వడం సాధారణంగా మారింది. చివరి ఆయకట్టు వరకు నీరందని పరిస్థితి ఉంది. దీంతో ఈ అంచనాలు, మొత్తం ఎత్తిపోతల పథకాలకు సరిపడా నీటి అవసరాలను ప్రాజెక్టు ప్రధాన కాలువల కింద ఆయకట్టుకు నీటి అవసరాలతో సహా లెక్కలు కట్టి ప్రాజెక్టు ద్వారా సరిపడా సాగునీటి లభ్యత నానాటికీ కొరవడుతోందని గుర్తించారు. ఈ సమస్య నుంచి అధిగమించడానికే పునరుజ్జీవ పథకం నిర్మించారు.

ఈ పథకం విజయవంతమై కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీ తీరాన్ని తాకి సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రధాన కాల్వల కింద ఆయకట్టుతో పాటు ఎత్తిపోతల పథకాలకు మూడు కాలాలు నీటికి ఢోకా లేని పరిస్థితి ఏర్పడింది. ఎత్తిపోతల పథకాల కింద రెండు పంటలు..అవసరమైతే మూడు పంటలు సాగు చేసుకోవ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు లీకేజీలు, కాలువలు ధ్వంసమై అధ్వానంగా మారిన చౌట్‌పల్లి, నవాబు , వేంపల్లి ఎత్తిపోతల పథకాలను, కాలువలను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోట్లాది రూపాయలు మంజూరు చేయించి ఆధునీకరణ పనులు చేయించారు. కాళేశ్వరం జలాలు అందుబాటులోకి రావడంతో ఈ పథకాల కింద పంటలు, చెరువులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పుష్కలంగా నీరు అందనుంది.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...