ఒకరిపై కేసు నమోదు


Mon,September 16, 2019 03:46 AM

శక్కర్‌నగర్: బోధన్ పట్టణంలోని రాకాసీపేట్‌కు చెందిన ఓ వివాహితపై శనివారం అర్ధరాత్రి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, చేయిపట్టి లాగిన ఘటనలో సయ్యద్ అర్షద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బోధన్ పట్టణ సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సదరు మహిళ తన కుమారుడికి వైద్య చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ దవాఖానలో ఉండగా అర్షద్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు చేయిపట్టి లాగాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో దవాఖానలో ఉన్న వారు అర్షద్‌ను పట్టుకునేందుకు యత్నించారు. కాగా ఈ ఘటనలో సదరు వ్యక్తిని దవాఖాన నుంచి తప్పించేందుకు సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న కొందరు సహకరించేందకు యత్నించారని బాధితురాలు తెలిపింది. అయినా సదరు వ్యక్తిని పట్టుకుని రాత్రి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అర్షద్‌పై ఎస్సీ, ఎస్టీ, పీవోఏ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...