రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించండి


Sun,September 15, 2019 01:55 AM

భీమ్‌గల్: రోడ్లకు ఇరువైపులా ఒక్కో గ్రామానికి కనీసం 200 మొక్కలను నాటించాలని డీపీవో జయసుధ ఆదేశించారు. మండలంలోని బాబాపూర్, బాబానగర్, పురాణీపేట్ గ్రామాల్లో శనివారం పర్యటించి 30 రోజుల ప్రణాళిక పనులను పరిశీలించారు. అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా పనులను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కకూ ట్రీగార్డును ఏర్పాటు చేయాలన్నారు. పిచ్చి మొక్కలను తొలగించాలని, మురికి కాలువలను శుభ్రం చేయించాలని, రోడ్లపై చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో పూలమొక్కలు నాటించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఖాళీ స్థలాలు ఉంటే గార్డెనింగ్ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు మోయీజ్, సర్పంచులు అతీక్, సిద్దపల్లి రాములు, తోట శంకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...