సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి


Sun,September 15, 2019 01:55 AM

కోటగిరి : సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విద్య అన్నారు. ఇటీవల డెంగీ, మలేరియా ఇతరత్రా వ్యాధులు వ్యాప్తి చెందడంతో వైద్యాధికారులు ముందస్తుగా గ్రామాల్లో తిరిగి ప్రజలకు వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ప్రతి కాలనీలో తిరిగి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్బంగా కాలనీ వాసులతో మాట్లాడారు. మురుగు కాలువలు, గుంతలో నీటి నిల్వలు ఉంటే వాటిపై దోమలు చేరి గుడ్లు పెట్టి వాటి ద్వారానే డెంగీ, మలేరియా వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీటిని ముందుగా కాచి చల్లార్చి తాగాలన్నారు. వేడివేడి ఆహార పదార్థాలు తినాలన్నారు. డెంగీ, మలేరియా వ్యాధి లక్షణాల గురించి వివరించారు. అంతకుముందు అంగన్‌వాడీకేంద్రంలో పోషకాహారం గురించి గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ కోళి రేఖ, సీహెచ్‌వో రవికుమార్, జ్యోతి, ఝాన్సీరాణి, సూపర్‌వైజర్ నిర్మల, జ్యోతి, సాయికుమారి, అంగన్‌వాడీ టీచరు సునీత తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...