విద్యతో పాటు విలువలు పెంచుకోవాలి


Sun,September 15, 2019 01:54 AM

-మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణుడు సుధీర్ సంద్రా
బోధన్, నమస్తే తెలంగాణ: విద్యార్థులు విద్యతో పాటు విలువలను పెంచుకోవాలని మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులు సుధీర్ సంద్రా అన్నారు. శనివారం బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మోటివేషనల్ స్పీచ్‌లో భాగంగా ఆయన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. నేటి సమాజంలో పలువురు అమ్మ ప్రేమను, నాన్న బాధ్యతలను విస్మరించి వృద్ధాప్యంలో వారిని వృద్ధాశ్రమంలోకి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ఆలోచనతో పాటు ఇలాంటి బాధ్యతలను విస్మరిస్తున్నారని, కనీసం నేటి యువతైనా ఈ విషయంపై దృష్టి సారించి అమ్మనాన్నల ప్రేమ, బాధ్యతలకు గుర్తెరగాలన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పలువురు అనేక ఉపాధి మార్గాలున్నా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని భావితరాలకు మంచి పౌరులను అందించాలనే ఉద్ధేశ్యంతో ఉత్తమ ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారని అన్నారు. రైతులు, సైనికులు నిజమైన హీరోలని, వారు తమ విధులను విస్మరించరని, ప్రతి యువకుడు సమాజంలో తన బాధ్యతలను గుర్తెరుగాలన్నారు. ఈ సందర్భంగా సుధీర్‌సంద్రాను పాఠశాల తరఫున ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కృష్ణమోహన్, పీఆర్‌వో ఐఆర్ చక్రవర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్‌పల్లి ప్రతినిధి ముత్తయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...