గ్రామీణులకూ హెచ్‌డీఎఫ్‌సీ రుణాలు


Sun,September 15, 2019 01:54 AM

శక్కర్‌నగర్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వయం ఉపాధిలో భాగంగా రుణాలు అందించేందుకు గాను శనివారం రుణమేళాను ప్రారంభించినట్లు బోధన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్ సుధాకర్ దయాల్ తెలిపారు. శనివారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముందుగా పలువురు పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించేందుకు గాను ఈ రుణమేళా కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ట్రాక్టర్లు, ఆటోలు అందించేందుకు రుణాలు అందిస్తున్నామన్నారు. ఈ రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు పూదోట రవికిరణ్, మాజీ ఎంపీపీ గిర్దావర్ గంగారెడ్డి, లయన్స్ క్లబ్‌ల ప్రతినిధులు ఐఆర్ చక్రవర్తి, కృష్ణమోహన్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీకాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...