ఉల్లాసంగా.. ఉత్సాహంగా


Sat,September 14, 2019 04:18 AM

జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకను శుక్రవారం అట్టహాసంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థినీ విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ, పాశ్చాత్య నృత్యాలతో వారు ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విజయవంతంగా వైద్య విద్య పూర్తిచేసి పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ముందుకు రావాలని కోరారు. తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, దవాఖాన సూపరింటెండెంట్ దీన్ దయాల్‌బంగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. - ఖలీల్‌వాడి

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...