రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక


Sat,September 14, 2019 04:16 AM

మాక్లూర్ : మండలంలోని శ్రీచంద్ర పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలకు ఎంపికైనట్లు జూడో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అభినవ్ తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో శ్రీచంద్ర విద్యార్థులు ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. హర్షవర్దన్, అభినవ్, రోహిత్, మనోజ్, దీక్షిత, సంజన, సుస్మిత, హరిత, సాహిత్య జిల్లా స్థాయికి ఎంపికై ఈనెల 13,14,15 తేదీల్లో హైదరాబాద్‌లోని రిషి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగే పోటీల్లో పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ పొల్కం శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శివశంకర్, డైరెక్టర్ పోల్కం విజయ, విద్యార్థులు పాల్గొన్నారు

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...