గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి


Sat,September 14, 2019 04:15 AM

మాక్లూర్ : 30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ఎంపీడీవో సక్రియానాయక్ గ్రామ కార్యదర్శులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రతి రోజూ చేయాల్సిన పనుల వివరాలపై ప్రణాళిక సంఘ సభ్యులు ప్రజాప్రతినిధులతో చర్చించాలని సూచించారు. హరితహారం, పారిశుధ్యం పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చేపట్టిన రోజువారీ పనుల వివరాలను తెలియజేయాలన్నారు. మండల ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న, ఈవోపీఆర్డీ రమణ, ప్రిన్సిపాల్ శివాజీ, జీపీ కార్యాదర్శులు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...