నెలాఖరులోపు ఓటరు పరిశీలిన పూర్తి చేయాలి


Sat,September 14, 2019 04:15 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ప్రతి ఓటరును బీఎల్వో యాప్‌లో బీఎల్వోలు పరిశీలించడాన్ని ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. ఆర్మూర్ తహసీల్ కార్యాలయంలో శుక్రవారం ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని బీల్వోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ.. బీఎల్వో యాప్‌లో ఓటర్ల వివరాలు తప్పుగా నమోదైతే వాటిని సరిచేయాలన్నారు. ప్రతి ఓటరును పరిశీలించి సంబంధిత ఓటరు కుటుంబాలను యాప్‌నందు ట్యాగింగ్ చేయాలని సూచించారు. ఆర్మూర్ తహసీల్దార్ రాణాప్రతాప్‌సింగ్, వీఆర్వోలు, బీఎల్వోలు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...