గంగరమందలో పచ్చదనం పక్షోత్సవాలు


Sat,September 14, 2019 04:15 AM

మాక్లూర్ : మండలంలోని గంగరమంద ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం పచ్చదనం పక్షోత్సవాలు నిర్వహించారు. హెచ్‌ఎం వసుంధర మాట్లాడుతూ.. గ్రామాన్ని పచ్చదనం, పరిశుభ్రంగా మార్చాలని విద్యార్థులు నిత్య, దుర్గ, రాజశ్రీ, ప్రణవి గ్రామ సర్పంచ్‌కు లేఖ రాశారని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనుగు గంగాధర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు పచ్చదనం - పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, మురికి నీరు ఇంటి ముందు నిల్వ కాకుండా చూడాలన్నారు. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలని సూచించారు. గ్రామంలో పచ్చదనం - పరిశుభ్రత కోసం కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. ప్రత్యేకాధికారి శ్రీనివాస్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు నగేశ్, రవి, సత్తెమ్మ, ఉపాధ్యాయులు రమణాచారి, వనిత, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...