తడిసి ముద్దయిన ఇందూరు


Fri,September 13, 2019 04:01 AM

-జిల్లావ్యాప్తంగా తేలిక పాటి వర్షం
-పారుతున్న పలు వాగులు
-చెరువుల్లోకి వస్తున్న వరద
జిల్లాలో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. నిజామాబాద్ నగరంలో మధ్యాహ్నం వర్షం ప్రారంభమై దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. వర్షానికి పలు వాగులు పారుతున్నాయి. చెరువుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. బుధవారం సైతం జిల్లాలో వర్షం కురిసింది. నందిపేట్‌లో అత్యధికంగా 43.1 మి.మీ వర్షం కురవగా.. అత్యల్పంగా వర్నిలో 1.9 మి.మీ వర్షపాతం నమోదైంది.
-నిజామాబాద్ యంత్రాంగం

నిజామాబాద్ సిటీ/మెండోరా/ఏర్గట్ల/నందిపేట్/ఇందల్వాయి/మోపాల్/మెండోరా/ కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ : నిజామాబాద్ జిల్లాలో గురువారం తేలికపాటి నుం చి మోస్తరు వర్షం కురిసింది. నిజామాబాద్ నగరంతో పాటు డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్, ఇందల్వాయి, ఏర్గట్ల, ఆర్మూరు, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిజామాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ రూరల్ మండలంలో రెండు గంటల పాటు వర్షం పడింది. బుధవా రం సైతం జిల్లాలో వర్షం కురిసింది. 14.8 వర్షపాతం నమోదైంది. నందిపేట్‌లో అత్యధికంగా 43.1 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా వర్నిలో 1.9 మి.మీ వర్షపా తం నమోదైంది. నిజామాబాద్ రూరల్ మండలంలో లోటు వర్షం నమోదైంది. కోటగిరి, మోపాల్, రుద్రూర్, వర్ని, డిచ్‌పల్లి, డిచ్‌పల్లి, మోస్రా, ముప్కాల్, ఇందల్వాయి, ధర్పల్లి, ఏర్గట్ల, బాల్కొండ, నిజామాబాద్ నార్త్, రెంజల్, చందూర్, నిజామాబాద్ సౌత్, మెం డోరా, నందిపేట్, మోర్తాడ్, నవీపేట్, ఎడపల్లి, సిరికొండ, బోధన్, ఆర్మూర్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

మాక్లూర్, వేల్పూర్, జక్రాన్‌పల్లి, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్ మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల వర్షపాతం వివరాలు ఈ వి ధంగా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ 7.0, కోటగిరి 2.3, ముప్కాల్ 2.0, రుద్రూర్ 6.3, డిచ్‌పల్లి 3.8, మోస్రా 3.5, ముప్కాల్ 27.0, ఇందల్వాయి, చందూర్ 2.5, ధర్పల్లి 12.3, ఏర్గట్ల 25.5, బాల్కొండ 32.8, నిజామాబాద్ నార్త్ 3.0, రెంజల్ 13.0, నిజామాబాద్ సౌత్ 6.4, మెండోరా 22.3, మోర్తాడ్ 31.5, నవీపేట్ 12.9, ఎడపల్లి 9.0, సిరికొండ 4.9, బోధన్ 6.7, ఆర్మూర్ 31.0, మాక్లూర్ 12.9, వేల్పూర్ 26.0, జక్రాన్‌పల్లి 18.3, కమ్మర్‌పల్లి 33.6, భీమ్‌గల్ 25.3 మి.మీ వర్షపాతం నమోదైంది.

-శ్రీరాంసాగర్‌లోకి 14,770 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి 14,770 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఏఈఈ మహేందర్ గురువారం తెలిపారు. గురువారం ఉదయం 2,981క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రారంభమై.. సాయంత్రం ఇన్‌ఫ్లో 14,770 క్యూసెక్కులకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, గురువారం సాయంత్రానికి 1071.80 అడుగులు (32.692 టీఎంసీల) నీటి నిల్వ ఉందన్నారు. గతేడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1085.90 అడుగులు (69.771 టీఎంసీల) నీటి నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ తాగునీటి అవసరాల నిమిత్తం కోరు ట్ల, జగిత్యాల పట్టణాలకు 50 క్యూసెక్కులు, నిర్మల్, ఆదిలాబాద్‌కు 34, నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్ పట్టణాలకు 58 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ఈ సీజన్‌లో ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి 28.296 టీఎంసీల వరద వచ్చి చేరిందని ఏఈఈ తెలిపారు.

-కమ్మర్‌పల్లిలో 32.6 మి.మీ. వర్షపాతం
కమ్మర్‌పల్లిలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉ దయం వరకు 32.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవాం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువ జాము వర కు భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు ముసురు వర్షం కొనసాగింది. చెరువులు, కుంటల్లో స్వల్పంగా నీరు పెరగడానికి ఈ వర్షం దోహదపడింది. ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామల్లో ముసురు వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వా రం రోజులుగా వర్షం పడకపోవడంతో రైతులు పసుపు, మొక్కజొన్న, సోయా, వరి పంటల కలుపుల్లో బిజీబిజీగా ఉన్నారు. నందిపేట్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రా మాల్లో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీళ్లు నిలిచిపోయాయి. వర్షపు నీళ్లు చెరువులు, కుంటల్లోకి చేరాయి.

ఇందల్వాయి మండలంలో బుధవా రం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, ఇం దల్వాయి, నల్లవెల్లి, సిర్నాపల్లి తదితర గ్రామాల చెరువులు నిండుకుండలా మారాయి. మోపాల్ మండలంలో గురువారం రెండు గంటల పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే మంచిప్ప పెద్దచెరువు నిండినప్పటికీ కొండ్లెం చెరువు, కులాస్‌పూర్ చెరువు పూర్తిస్థాయిలో నిండాల్సి ఉంది. ఈ చెరవులకు గుట్టలపై నుంచి వరద వచ్చి చెరువులో చేరుతుంది. వర్షం ఇలాగే పడితే ఈ చెరువులు కూడా అలుగు పారే అవకాశముందని తెలిపారు.

128
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...