డయేరియాపై పోరు


Fri,September 13, 2019 04:00 AM

-నివారణకు రోటా వ్యాక్సినేషన్
-జిల్లాలో ఈనెల 16 నుంచి 21 వరకు అమలు
-ఏర్పాట్లు చేసిన వైద్యశాఖ
-సిబ్బందికి శిక్షణ పూర్తి

మోర్తాడ్ : రాష్ట్ర ప్రభుత్వం నూతన వైద్య విధానాలు అమలు చేయడంలో ముందుంటున్నది. రాష్ట్రంలో డయేరియా కారణంగా ఏడాదిలోపు పిల్లలు దాదాపు 40శాతం మంది దవాఖానల పాలవుతుండగా, మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. తొలిసారి రాష్ట్రంలో డయేరియాకు కారణమైన రోటావైరస్‌ను అరికట్టేందుకు రోటావైరస్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జిల్లాలో ఈనెల 16 నుంచి 21 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

-ప్రతినెలా 2,400 మందికి..
జిల్లాలో ప్రతినెలా 2400 మంది పిల్లలకు రోటావైరస్ వ్యాక్సిన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రతినెలా జన్మిస్తున్న పిల్లల సంఖ్య 2400గా ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. డయేరియా నివారణకు ఒక్కో పిల్లవాడికి మూడు దఫాలుగా రోటావైరస్ వ్యాక్సిన్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

-మూడు డోసులు..
ఆరు వారాలకు మొదటి వ్యాక్సిన్, 10 వారాలకు రెండో వ్యాక్సిన్, 14వారాలకు మూడో వ్యాక్సిన్‌ను వేస్తారు. నోటి ద్వారా అందించే రోటావైరస్ వ్యాక్సిన్ పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేశారు.

-పూర్తయిన శిక్షణ కార్యక్రమాలు..
రాష్ట్రంలో మొదటిసారి ప్రవేశపెడుతున్న రోటావైరస్ వ్యాక్సిన్‌ను పంపిణీకి సంబంధించి ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు హైదరాబాద్‌లో, మండల స్థాయి వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, స్టాఫ్‌నర్సులు, మిగతా సిబ్బందికి జిల్లాకేంద్రంలో, ఆశవర్కర్లకు, అంగన్‌వాడీ టీచర్లకు మండల కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలను పూర్తిచేశారు.

-16 నుంచి జిల్లాలో పంపిణీ..
ఈనెల 16 నుంచి 21 వరకు జిల్లా వ్యాప్తంగా రోటావ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆరురోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ఏడాదిలోపు పిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ వేస్తారు. అందుకోసం అవసరమైన వ్యాక్సిన్లను అధికారులు అందుబాటులో ఉంచారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...