పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి


Thu,September 12, 2019 04:48 AM

ఏర్గట్ల : గ్రామాల్లో ఇండ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని డీఎల్‌పీవో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని తొర్తి గ్రామంలో జరగుతున్న 30 రోజులు ప్రణాళిక కార్యక్రమాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయన గ్రామంలో విధుల గుండా తీరుగుతూ మురికి కాల్వలు, పైడికతీత, తొలగించిన పిచ్చి మొక్కలు, పాడుపడ్డ బావులు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి విషయంలో ఎలాంటి సమశ్యలున్నా తమ వద్దకు వస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియజేయాలని సూచించారు. పరిసరాల శుభ్రతను పాటించాలని, ఈ విషయలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి అవినాశ్, సర్పంచ్ కుండ నవీన్, ఉపసర్పంచ్ తాహెర్, పంచాయతీ కార్యదర్శి స్వప్న, కోఆప్షన్ మెంబర్లు, నాలుగు కమిటీల సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, అశవర్కర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లో వీధులను సందర్శించారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...