వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి


Thu,September 12, 2019 04:48 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ: వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎం హెచ్‌వో తుకారాం రాథోడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి జాతీయ కీటక జనిత వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఆయన మాట్లాడుతూ... సీజనల్‌గా వచ్చే మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, బోదకాలు తదితర వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించాలన్నారు. మురుగునీరు నిల్వకుండా చూసుకోవాలని చెప్పాలన్నారు. కార్యక్రమంలో వైద్యశాఖ సిబ్బంది, మున్సిపల్ టీపీఆర్‌వో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...