పెద్ద విగ్రహాలను బాసర గోదావరిలో నిమజ్జనం చేయాలి


Thu,September 12, 2019 04:48 AM

-3 అడుగుల ఎత్తు వరకే వినాయకుల బావిలో అనుమతి
నిజామాబాద్ క్రైం: జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో పతిష్ఠించిన వినాయక ప్రతిమలను నగరంలోని వినాయక నగర్‌లో ఉన్న వినాయక బావిలో నిమజ్జనం చేయాల్సి ఉంటుందని కలెక్టర్ రామ్మోహన్‌రావు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే నగరంలోని వినాయకుల బావిలో కేవలం మూడు అడుగుల ఎత్తు వరకు ఉన్న గణేశ్ ప్రతిమలనే నిమజ్జనానికి అనుమతి ఉందని తెలిపారు. అంత కంటే ఎత్తైన వినాయక ప్రతిమలను నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో నిమజ్జనం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అక్కడ నిమజ్జన చేసేందుకు క్రేన్‌లు, లైటింగ్ వ్యవస్థతో పాటు ఇతర అన్ని సదుపాయాలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. నిమజ్జన సమయంలో గణేశ్ ప్రతిమలను తరలించే వాహనదారులు సక్రమంగా, ఒక వాహనం వెనకాల మరో వాహనాన్ని నడుపుతూ జాగ్రత్త వెళ్లాలని సూచించారు. బాసర గోదావరి నది వరకు నిమజ్జన కోసం వెళ్లలేని వారు నిజామాబాద్ మండల పరిధిలోని మల్లారం, అర్సపల్లితో పాటు ఇతర తమ గ్రామాలకు చేరువలో ఉండే చెరువుల్లో విగ్రహాల నిమజ్జం చేయాలని వెల్లడించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...