ఆర్మూర్ అభివృద్ధిపై గణేశ్ మండపంలో సెట్టింగ్


Thu,September 12, 2019 04:47 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని జమ్మన్ జట్టిగల్లీలోని ప్రిన్స్ యూత్ క్లబ్ సభ్యులు ఏర్పాటు చేయించిన సెట్టింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నది. క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులతో కూడిన సెట్టింగ్‌ను రూ. 1.50లక్షల వ్యయంతో గణేశ్ మండలంలో ఏర్పాటు చేయించారు. పట్టణంలోని జరిగిన, చేసిన పలు అభివృద్ధి పనులతో కూడిన సెట్టింగ్‌ను తలారి చందు, పృథ్విరాజ్, రోహిత్, అన్వేశ్, కార్తీక్ తదితర ప్రిన్స్‌యూత్ సభ్యులు ఏర్పాటు చేయించి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై అభిమానాన్ని చాటుకున్నారు. సెట్టింగ్‌లో సిద్ధుల గుట్ట, క్లాక్‌టవర్, భారీ జాతీయ జెండా, అంబేద్కర్ చౌరస్తా, నవనాథ సిద్ధుల విగ్రహాలు, వాటర్ ఫౌంటేన్, కాకతీయ తోరణం, ఆలూర్ బైపాస్‌రోడ్, ఆర్డీవో కార్యాలయం, జిమ్, మినీట్యాంక్‌బండ్, 100 పడకల దవాఖాన తదితర అభివృద్ధి పనులను పొందుపర్చారు. ప్రిన్స్‌యూత్ క్లబ్ సభ్యులు 1980 నుంచి క్లబ్ ఆధ్వర్యంలో గణేశ్ విగ్రహాలను ప్రతిష్టిస్తూ పూజలు చేస్తున్నారు. 2013 సంవత్సరం నుంచి యేటా వినూత్నంగా వినాయక ప్రతిమలను ప్రతిష్ఠిస్తున్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...